జోన్`2 కమిషనర్‌గా పి.సింహాచలం బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం (మధురవాడ): జీవీఎంసీ జోన్ 2 జోనల్ కమిషనర్‌గా పొందూరు సింహాచలం గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సింహాచలం జోనల్ - 5, జ్ఞానపురం జోన్-6 గాజువాక పరిధిలో పని చేశారు. ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం ఇక్కడి నుంచి బదిలీ కావలసి వచ్చింది. అయితే తిరిగి మళ్లీ జూన్ 2 మధుర వాడకు జోనల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధుల ఆదేశానుసారం ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా జోనల్ ఆఫీస్‌లోని వివిధ శాఖలకు చెందిన అధికారులు అందరూ జెడ్సీ సింహాచలా నికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.