విమాన్ నగర్లో యువకుడి ఆత్మహత్య
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగరంలోని ఎనఏడీ విమాననగర్‌కు చెందిన ఎలిసెట్టి భవానీ శంకర్(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఎలిసెట్టి భవానీ శంకర్(34) వార్తాపత్రికలు పంపిణీ చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్య లతో బాధపడుతూ చికిత్స కోసం మందులు వాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 16న ఉదయం 8 గంటల సమయంలో ఇంటి పనుల నిమిత్తం తల్లి బయట కు వెళ్లగా, తండ్రి జగన్నాథరావు కూలీ పనులకు వెళ్లారు. ఆ సమయంలో భవానీ శంకర్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఉదయం 11 గంటలకు తల్లి ఇంటికి వచ్చి చూడగా, హాలు లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. పక్కింటి బంధువులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మానసిక ఆరోగ్య సమస్యలు, తీవ్ర మనోవేదన (డిప్రెషన్) కారణంగా భవానీ శంకర్ ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.