ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల గడువు పెంపు వైసీపీ పిటిషన్
îవిచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మరోసారి ప్రతిపక్ష వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, కొందరిని హౌస్ అరెస్ట్‌లు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ నాయకులు, అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, స్వేచ్ఛగా నామినేషన్లు వేసే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ పిటిషన్లో పేర్కొంది. అయితే వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది.
నామినేషన్ల గడువు పెంచాలని అభ్యర్థన..
పిటిషన్లో వైసీపీ వెంటనే తమ అభ్యర్థులను రిలీజ్ చేసి, వారు నామినేషన్లు వేసేందుకు తగిన సెక్యూరిటీ కల్పించాలని కోరింది. నామినేషన్లు వేయకుండా వెళ్తున్న అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కేసులను కూడా పెట్టాలని అభ్యర్థించింది. అలాగే ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని నామినేషన్లు వేయడానికి గడువును కనీసం 48 గంటల పాటు పొడిగించాలని కోరింది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి.. జిల్లా కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసుల్లో నేరుగా నామినేషన్లు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని వైసీపీ కోర్టును కోరినట్టు తెలుస్తుంది.
హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జరగిన సంఘటనలపై వైసీపీ వేసిన పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల, పోలింగ్ తేదీల షెడ్యూల్‌నే మార్చాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు వైసీపీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (Sజ్పుు), పోలీసులకు న్యాయస్థానం ఏమైనా ఆదేశాలు జారీ చేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.