62వ వార్డులో జనసేన పార్టీ రోడ్ షో
అక్షర కిరణం, (మర్రిపాలెం): జీవీఎంసీ 62వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్, 62వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ పాల్గొన్నారు. రోడ్ షోలో భాగంగా మర్రిపాలెంలోని ఎఫ్‌సీఐ కాలనీ, పార్వతి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. జనసేన పార్టీ (కూటమి) కార్పొరేటర్ అభ్యర్థిగా నీరుకొండ దివాకర్‌ను అఘండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.