ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్..
నవంబర్ 1న పోలింగ్, 3న కౌంటింగ్
నాలుగు చోట్ల నామినేషన్లు స్వీకరణ
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి Sజ్పుు సవరించిన షెడ్యూల్ ప్రకటించింది. కొత్త షెడ్యూలు ప్రకారం నవంబరు 1న 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీలకు పోలింగ్ నిర్వహించను న్నారు. ఒకవేళ అవసరమైన చోట్ల నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించి నవంబర్ 3న ఓట్లు లెక్కిం# áనున్నారు. మైదుకూరులోని 32 వార్డులు, రాజంపేటలోని 11 వార్డులకు నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం పొడిగించారు. అలాగే కడప కార్పొరేషన్లోని 11, తిరుపతిలోని 18 డివిజన్లకు కూడా కొత్తగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఇలా మొత్తంగా 72 వార్డులు/ డివిజన్లకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఈ నెల 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరిస్తారు.. 25న ఉదయం నామినేషన్ల పరిశీలన, అదేరోజు ఉపసంహ రణకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి ఉంటుంది.. ఆ తర్వాత ఉపసంహరణ ఉంటుంది. వార్డుల వారీ నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగించిన పట్టణ స్థానిక సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. కడప కార్పొరేషన్లోని 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55 (11 వార్డులు). రాజంపేట మున్సిపాలిటీలోని 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27 (11 వార్డులు). మైదుకూరు మున్సిపాలిటీలోని 32 వార్డులు. తిరుపతి కార్పొరేషన్లో 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66 (18 వార్డులు)కు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు.
కొత్తగా నామినేషన్లను గతంలో ప్రకటించిన నామినేషన్ కేంద్రాలతో పాటు అదనంగా జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణాల్లోనూ స్వీకరిస్తారు. మిగిలిన చోట్ల నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు. APSజ్పుు సవరించిన షెడ్యూల్ ప్రకారం 25న అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు.. నవంబర్ 1న పోలింగ్, 2న రీపోలింగ్, 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే సిరిమాను ఉత్సవం కారణంగా విజయనగరం నగరపాలక సంస్థకు అక్టోబరు 28న కాకుండా.. 29న పోలింగ్ నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే కొత్త షెడ్యూల్ రావడంతో ఇక్కడ కూడా నవంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ఎన్నికల సంఘం తొలివిడతలో 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ జారీచేసి..ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించింది. ఈ నెల21న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణలకు గడువు ఇచ్చింది. కానీ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయ కుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కీలక ఆదేశాలు ఇచ్చింది. తుది జాబితా ప్రకటనను వాయిదా వేసి నామినేషన్లు వేయలేకపోయినవారికి అవకాశం కల్పించాలని ఆదేశించింది. దీంతో Sజ్పుు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసింది. అన్ని జిల్లాల నుంచి నివేదికల్ని కోరి వాటిని పరిశీలించి కొత్త షెడ్యూల్ ప్రకటించారు.