ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
îకేంద్రం గ్రీన్‌సిగ్నల్
îరెండోసారి అవకాశం
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ సీఎస్ జి సాయిప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. సీఎస్ పదవీ కాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. సాయిదప్రసాద్ పదవీకాలం పెంపుపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ రాజేశ్‌కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేశారు. దీంతో సాయిప్రసాద్ 2027 మే వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. సాయిప్రసాద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. ఆయన 2026 మార్చి 1న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన 2026 మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆరు నెలలు పదవీకాలం పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ ఆరు నెలల గడువు నవంబర్ 30తో ముగుస్తుండగా.. మరోసారి ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడగించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 29న లేఖ రాయగా సానుకూలంగా స్పందించారు.
జీ సాయిప్రసాద్ది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మట్టిగుంట.. ఆయన ఎంటెక్ చదవగా.. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సాయిప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆయన 1992 నుంచి 1993 వరకు వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 1993 నుంచి 1995 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా..1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేశారు. 1997 నుంచి 1998 వరకు కడప జాయింట్ కలెక్టర్‌గా..2000 నుంచి 2003 వరకూ కర్నూలు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
సాయిప్రసాద్ 2010 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2011 అక్టోబరు 31 నుంచి 2014 జూన్ 15 వరకు కేంద్ర ఇంధనశాఖలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ఇంధన, రెవెన్యూ రంగాలలో కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. 2024 జూన్ నుంచి 2026 వరకు వరకు జల వనరుల శాఖ, రెవెన్యూశాఖకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్నారు. ఆ తర్వాత సీఎస్ అయ్యారు.