జీవీఎంసీ 84వ వార్డులో
వైసీపీ అభ్యర్థి గుడివాడ అనూష గెలుపు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ ఎన్నికల ఫలితాల్లో 84వ వార్డు నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వదిన గుడివాడ వెంకట సాయి అనూష ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఆమె 3000 పై చిలుకు భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి అనూష ఆధిక్యం కనబరుస్తూ చివరకు ఘన విజయం సాధించడంతో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లోను, ఆమె అభిమానుల్లోను హర్షం వ్యక్తం అవుతోంది.