జీవీఎంసీ ఎన్నికల్లో తండ్రీకూతుళ్ల విజయం
Å6వ వార్డులో పోతిన హనుమంతరావు, 7వ వార్డులో పోతిన జాహ్నవి గెలుపు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో తండ్రీ, కూతుళ్లు రికార్డు సృష్టించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఇద్దరూ గెలుపొందారు. 6వ వార్డు నుంచి పోతిన హనుమంతరావు, 7వ వార్డు నుంచి పోతిన జాహ్నవి విజయం సాధించారు. తండ్రీ కూతుళ్లు ఇద్దరు విజయం సాధించడంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. వారి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న 6, 7 వార్డుల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి విజయాన్నందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.