1,19,683 ఓట్ల భారీ ఆధిక్యంలో
ముక్కా శ్రావణి
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మేయర్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 4,36,676 ఓట్లను లెక్కించారు. వీటిలో టీడీపీకి 2,56,881 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణి 1,37,198 ఓట్లు సాధించారు. ఇతరులు 37,163 ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీకి 5434 ఓట్లు లభించాయి. దీంతో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణిపై 1,19,683 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతు న్నారు. కాగా మొత్తం 120 వార్డులకు గాను టీడీపీ 18, జనసేన 9, బీజేపీ 1, వైసీపీ 4, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.