నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా
చింతకాయల పద్మవతి
అక్షర కిరణం, (నర్సీపట్నం): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో కూటమి జయకేతనం ఎగుర వేసింది. మున్సిపాలిటీ చైర్పర్సన్ సీటును టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మవతి గెలుపొందారు. ఆమె వైసీపీ అభ్యర్థి చింతకాయల అనితపై 11,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 3 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందగా వైసీపీ 1 వార్డులో గెలుపొందింది.