60వ వార్డులో టీడీపీ అభ్యర్థి సనపల కీర్తి ఘన విజయం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ ఎన్నికల ఫలితాల్లో 60వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా పోటీ చేసిన సనపల కీర్తి విజయం సాధించారు. ఎన్నికల అధికారులు ఆయన విజయాన్ని ధ్రువీకరిస్తూ అధికారిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. సనపల కీర్తి 2,100 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి పాతిన సారం> ·ధరుడుపై ఘన విజయం సాధించారు. ఈసందర్భంగా తన విజయానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలు, అభిమానులకు సనపల కీర్తి ధన్యవాదాలు తెలిపారు. కీర్తి విజయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.