కేకే రాజుతో వైసీపీ విశాఖ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ భేటీ
అక్షర కిరణం, (మాధవధార): వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరానికి చెందిన పార్టీ సీనియర్ సభ్యుడు పాతపట్నం రామ్మోహన్ను వైసీపీ విశాఖపట్నం జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈనేపథ్యంలో రామ్మోహన్ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేకే రాజు పాతపట్నం రామ్మోహన్ ను అభినందించారు. కార్యక్రమంలో వైసీపీ అభిమానులు బొడ్డు రాంబాబు, సనపల రమేష్, కొట్యాడ పార్థసారథి, సలపల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.