తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం
అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు హుండీ ఆదాయం
అక్షర కిరణం, (తిరుమల): తిరుమల శ్రీవారికి కాసుల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. వడ్డ్డీకాసుల వాడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల భారీగా భక్తులు తరలివస్తుంటారు. భారీఎత్తున శ్రీనివాసుడికి విరాళాలు సమర్పిస్తారు. స్వామికి బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలు, వస్తువులను కానుకలుగా ఇస్తారు. భక్తులందరూ కానుకలను ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో వేస్తారు. ఈక్రమంలో అక్టోబర్ నెలలో భక్తులు భారీగా తరలివచ్చి.. శ్రీనివాసుడిపై కాసుల వర్షం కురిపిం చారు. తాజాగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని తిరు మల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంతే కాకుండా అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు. లడ్డూల విక్రయాల గురించి వివరాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ వెల్లడిరచారు.
తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వెల్లడిరచారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల ద్వారా శ్రీవారికి హుండీకి రూ. 119.35 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబర్లో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని పేర్కొన్నారు. అలాగే టీటీడీ అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 34.20 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని వెల్లడిరచారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ పేర్కొన్నారు.