మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు, గ్రూప్-1 పోస్టు ఇచ్చిన సీఎం చంద్రబాబు
అక్షర కిరణం, (అమరావతి): మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టు సభ్యురాలు శ్రీచరణికి రూ.2.5 కోట్లు, వెయ్యి చదరపు గజాల నివాస స్థలం బహుమతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆమెకు గ్రూప్-1 పోస్టు కూడా ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో శ్రీచరణి భేటీ అయ్యారు. ప్రపంచ కప్ గెలుపుతో భారతీయ మహిళల శక్తి ప్రపంచానికి తెలిసిందని ముఖ్యమంత్రి, లోకేష్ ఆమెను అభినందించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, శ్రీచరణి మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులు సంతకం చేసిన టీషర్టును ముఖ్యమంత్రికి అందజేశారు.
అంతకుముందు విజయవాడ విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు వంగలపూడి అనిత, ఎస్.సవిత, గుమ్మడి సంధ్య రాణి, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని శివనాథ్, కార్యదర్శి సతీష్, ఎస్ఏఏపీ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.