సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంపై చెప్పులు, రాళ్లతో దాడి..
కముర్దాబాద్ అంటూ నినాదాలు
అక్షర కిరణం, (బిహార్/జాతీయం): బిహార్ ఉప-ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లఖిసరై నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్‌పై కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. అంతటితో ఆగకుండా, ‘ముర్దాబాద్’ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. భూమిహర్ సామాజిక వర్గానికి చెందిన సిన్హా.. లఖిసరాయ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఇదే స్థానం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. నవంబరు 6న తొలిదశలోనే అక్కడ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పోలింగ్ బూత్‌లను సందర్శిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తన కాన్వాయ్‌పై దాడి వెనుక ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) హస్తం ఉందని విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ‘బిహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధి కారంలోకి వస్తుంది.. అప్పుడు వాళ్ల గుండెలపై బుల్డోజర్లను ఎక్కిస్తాం’ అని ఆయన హెచ్చరించారు. కొన్ని పోలింగ్ కేంద్రా ల్లో తమ ఏజెంట్లను బయటకు గెంటేశారని, ఓటు వేయడా నికి వచ్చినవారికి అడ్డుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే, పోలీసులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగు తోందని చెప్పడం గమనార్హం. పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్నారనే ది కేవలం ప్రచారం మాత్రమేనని, అందులో నిజం లేదని లఖిసరాయ్ జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
‘‘మేము ఇక్కడకు వచ్చేసరికి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. క్యూలో నిల్చోనివారిని మాత్రమే అడ్డుకుంటు న్నారు’’ అని తెలిపారు. అంతేకాదు, రెండు బూత్‌ల్లో నుంచి పోలింగ్ ఏజెంట్లను బయటకు గెంటేశారనే ఆరోపణలను ఆయన ఖండిరచారు. ఎస్పీ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన ‘పిరికిపంద’. ‘బలహీనుడు’ అంటూ మండిపడ్డారు. ‘వాళ్లు (ఆందోళనకారులు) డిప్యూటీ సీఎంను లోపలికి వెళ్లనివ్వడం లేదు. ఇది యంత్రాంగానికి అవమానం’ అని అన్నారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ ‘డిప్యూటీ సీఎం సిన్హా కాన్వాయ్ ఎదురుగా నిరసనలు జరిగాయి, ఆ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.
లఖిసరాయ్‌లో నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎన్డీయే) అభ్యర్థిగా విజయ్ కుమార్ సిన్హా, కాంగ్రెస్ నుంచి అమరేశ్ కుమార్, జన్ సూరజ్ పార్టీ తరఫున సూరజ్ కుమార్ బరిలో ఉన్నారు. కాగా, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోడానికి ఏమాత్రం అనుమతించబో మని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించింది. తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంటుందని జిల్లా కలెక్టర్ మిథిలేష్ మిశ్రా అన్నారు. అలాగే, ప్రజలకు కూడా తసమస్యలను, అసంతృప్తులను వ్యక్తపరచే హక్కు ఉందని పేర్కొన్నారు.