వైసీపీ తూర్పు నియోజకవర్గం సమావేశం
అక్షర కిరణం, (మాధవధార): తూర్పు నియోజక వర్గం కార్యాలయంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వ హించారు. సమావేశంలో ఎస్.ఐ.ఆర్ సర్వేలో తూర్పు నియోజకవర్గంలో 13000కి పైగా ఓటర్లు రెండు సార్లు నమోదు అయినట్టు తెలిపారు. వాటి వివరాలు సేకరించి, ఒక ఓటు తొలగించే విధంగా ఎన్నికల కమిషన్ చూడాలని, దీనిపై బూత్ లెవల్ ఏజెంట్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు జి.రవిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, వైసీపీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, పార్టీ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి, జిల్లా బూత్ కన్వీనర్ల అధ్యక్షుడు నీలి రవి, తూర్పు అధ్యక్షుడు కోన కామేష్, వార్డు అధ్యక్షులు పతివాడ కనకరాజు, మొల్లి హేమంత్, కణితి మరియదాసు, చొల్లంగి నాగేశ్వరరావు, పలికిల నీలారెడ్డి, సురాడ వెంకటలక్ష్మి, మదుపాడ రవి, బూస రమణారెడ్డి, పులగం సూర్యనారాయణ రెడ్డి, మెట్ట సూర్యనారాయణ, మీసాల ప్రదీప్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.