ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను తెలియజేయాలి
Åకలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
అక్షరకిరణం, (శ్రీకాకుళం): ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మ్ 6, 7, 8 క్లైయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పైన వాటి వివరాలు తెలియజేశారు. నియోజక వర్గాల వారీగా అభ్యంతరలేమైనా ఉంటే తెలియజేయా లన్నారు. ఈనెల 22, 23వ తేదీలలో స్వీకరించిన ఫారాలు వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. ప్రత్యేక జాబితా సరవణకు సంబంధించి నోటీసులు, ఇప్పటి వరకు జరిగిన వివరాలను ఆయన తెలిపారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బిఎలఓతో డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు వివరించారు. అప్డేషన్ చేయవలసివి 64,380 ఉన్నట్లు చెప్పారు. నియోజవర్గాల్లో అప్డేషన్ చేయవలసిన వారు ఇంకెవరైనా ఉంటే వారిని సత్వరమే అప్డేషన్ చేయించేం దుకు చర్యలు తీసుకోవాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, టీడీపీ నుంచి పీఎంజే బాబు, వైసీపీ నుంచి ఆర్. శంకరరావు, దామా మన్మధరావు, జనసేన పార్టీ నుండి భూపతి అర్జున్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్. అన్నాజి రావు, కేవీఎలఎస్ ఈశ్వరి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.