ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో జూని యర్ డాక్టర్లు ఎట్టకేలకు సమ్మెను విరమించారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు జూనియర్ డాక్టర్ల సంఘం తెలియ జేసింది. అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. రెండు వారాల్లోగా జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభు త్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది.. ఇవాళ కోర్టు విచారణ చేపట్టగా.. జూనియర్ డాక్టర్లు తాము సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మెను సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త రవీంద్రకుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 9వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారని.. వారిపై ఎస్మా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిష నర్ తరఫున లాయర్ కోర్టును కోరారు. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చి స్తోందని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలకు ఇబ్బందు లేకుండా చర్యలు తీసుకుందన్నారు.
జూనియర్ డాక్టర్లు డిమాండ్లపై హైకోర్టు ధర్మాసనం ఆరా తీయగా.. ఇతర రాష్ట్రాల్లో చెల్లించే స్టైఫండ్ కంటే ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఏజీ తెలిపారు. వారి డిమాండ్‌ను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజనాపై భారం పడు తుందన్నారు. ఈ వాదనల తర్వాత జూనియర్ డాక్టర్ల అసోసి యేషన్ స్పందన ఏంటో తెలియజేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవల కు ఇబ్బంది లేకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు.. జూని యర్ డాక్టర్లతో సమ్మె విరమించజేయడానికి ఏం చేస్తున్నారో తెలియజేయాలని కూడా ఆదేశించింది. ఇవాళ విచారణ జర గ్గా.. తాము సమ్మె విరమిస్తున్నట్లు జూ. డాక్టర్లు ప్రకటించారు.
జూ.డాక్టర్లు ప్రధానంగా మూడు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. స్టైఫండ్ 20శాతం పెంచాలని.. ప్రొఫెసర్ల ఉద్యోగవిరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను విర మించాలని.. నాన్ క్లినికల్ పోస్టుల్ని ఎంఎస్సీ పీహఎచ్డీలతో కాకుండా అర్హులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎని మిది నెలలుగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మెకు దిగామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపినా ఫలించలేదు.. ఇంతలో ఈ అంశం హైకోర్టుకు చేరగా.. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. అయితే ఏపీ హైకోర్టు జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.