కార్మికులకు అండగా నిరాహార దీక్ష చేస్తా
ప్లాంట్‌ను బీజేపీ నిర్వీర్యం చేసింది అవసరమైతే రాహుల్ గాంధీని తీసుకొస్తాం
తొలగించిన 4 వేల మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
స్టీల్‌ప్లాంట్ వద్ద బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బైఠాయిం చారు. స్టీల్‌ప్లాంట్‌లో తొలగించిన 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె డెడ్‌లైన్ విధించారు. ఈ నెల 4న మధ్యాహ్నం ఒంటి గంటలోపు తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్షకు దిగుతా నని షర్మిల హెచ్చరించారు.
4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయమని, నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికం అని, కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉండేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయేసరికి ప్లాంట్‌ను నీరు గార్చారని షర్మిల తెలిపారు. షర్మిల మాట్లాడుతూ అంచెలం చెలుగా ప్లాంట్‌ను దెబ్బ తీశారని ఆరోపించారు. 32 మంది బలిదానాలతో ప్లాంట్ ఏర్పడిరదన్నారు. ఎంతోమంది భూము లు స్వచ్చందంగా ఇచ్చారన్నారు. విశాఖకు సొంత మైన్ లేద ని, ప్లాంట్‌కి ఇచ్చే ముడిపదార్ధాల ధరలు పెంచారని విమ ర్శించారు. పాలకులు సిక్ ఇండస్ట్రీగా స్టీల్ ప్లాంట్‌ను మార్చా రని మండిపడ్డారు. నష్టాలను సాకుగా చూపి అమ్మాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్లాంట్‌ను విస్తరించారని తెలిపారు. 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారని తెలిపారు. 20 మిలియన్ టన్స్కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత బీజేపీ పాలకులు ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ని 1 మిలి యన్ టన్స్కి తగ్గించారని మండిపడ్డారు. ఉత్పత్తి తగ్గడానికి ఈపాలకులే కారణం అన్నారు. విశాఖ భూముల మీద మోదీ కన్ను పడిరదన్నారు. కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదని వాపోయా రు. ఇద్దరు కార్మికులు చనిపోయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. వైఎస్ఆర్ హయంలో ప్లాంట్ కోసం అనంతపురం లో ఒకమైన్ కూడా ప్లాన్ చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఎవరికి ప్లాంట్ కష్టాలు పట్టలేదన్నారు. విశాఖ స్టీల్ కష్టాలు పట్టని కేంద్రంతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. బాబు, పవన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
విధుల నుంచి తొలగించిన 4 వేల మందిని తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి 48 గంటల సమయం ఇస్తున్నామని, ఈనెల 4న మధ్యాహ్నం 1 గంట లోపు కాంట్రాక్టు కార్మికులను తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. 4 వేల మందిని విధుల్లో తీసుకోక పోతే నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఇదే ప్లాంట్ ఆవరణలో షర్మిలా రెడ్డి దీక్ష చేస్తుందన్నారు. అవసరం అయితే రాహుల్ గాంధీని కూడా తీసుకు వస్తామని చెప్పారు.