సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
Åస్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ స్థాయిలో మేలు చేకూరుస్తున్నాయో చాటిచెప్పేలా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాళ్లు నిలిచాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో భాగం గా ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ, అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనలో పశుసంవర్ధక, వ్యవసాయ, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల తోపాటు ఏపీ ఎంఐపీ, మెప్మా, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్టాళ్లు కొలువుదీరాయి. అలాగే నీకో పవర్, ఆర్కే సోలార్, ఆక్వాకల్చర్, యూబీఐ ఆర్సెటీ సంస్థలు తమ నైపుణ్య, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహిం చగా.. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీ, ఉచిత వైద్య శిబిరం, తాగునీటి స్టాళ్లు సందర్శకులకు అందుబాటులో నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, ఎమ్మెల్యే గొండు శంకర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.