‘జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం’
అక్షర కిరణం, (పద్మనాభం): జర్నలిస్టుల సమస్యలు పరి ష్కారానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని పద్మనాభం తహసీల్దార్ దాడిశెట్టి శైలజ, సీఐ మీసాల చంద్రమౌళి హామీ ఇచ్చారు. మంగళవారం పద్మనాభం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల పాత్రికేయుల సమావేశం నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ జర్నలిస్టులతోనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందన్నారు. నిరం తరం కష్టపడి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి ఎంత గానో కృషి చేస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు ఇళ్లు కేటా యించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.. పాత్రికే యులు అందరూ సమన్వయంతో ముందుకు సాగుతూ సమాజ ప్రగతికి మరింతగా తోడ్పాటు అందించాలని వారు ఆకాంక్షించారు. సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరే షన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నగరంతోపాటు గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు తమ వంతు అండగా ఉంటామన్నారు.. వారికి అవసరమైన అక్రిడేషన్లు హెల్త్ ఇన్సూరెన్స్. ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కా రానికి యూనియన్‌పరంగా సంపూర్ణ సహకారం అందిస్తా మన్నారు.. పద్మనాభం మండల రిపోర్టర్లు ఐక్యంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని కొనియా డారు. విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ ప్రధాన కార్య దర్శి జి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి పద్మనాభం ఫెడరేషన్ నాయకులు కే సత్య నారాయణ సభాధ్యక్షత వహించి స్థానికంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రస్తుత ఎంపీపీ రాంబాబు మాజీ ఎంపీపీ గోపిరాజు, ఫెడరేషన్ నాయకులు కే తులసీ దాసు, బి ప్రసాద్, కే త్రినాథ్, పి రాజు, ఏ దేవుడు, బి అప్పల నాయుడు, రంగధామారావు, విశాఖ జిల్లా బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్ స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్ అసోసి యేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి కే శ్రీనివాసరావు, ఇతర ప్రతి నిధులు హరి బొబ్బర ప్రసాద్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.