స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగాలను స్మరించుకోవాలి
Åస్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణా లర్పించిన మహనీయుల త్యాగాలను, వారు పాటిం చిన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ స్మరించుకో వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఆనాడు గాంధీజీతో పాటు అనేకమంది పోరాట యోధులు పడిన కష్టాలు, సేవలు నేటి తరం చిన్న పిల్లలకు సైతం తెలిసేలా వివరించాలని ఆయన సూచించారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి తమ విధులను సక్రమంగా నిర్వహించినప్పుడే కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉంటుం దని కలెక్టర్ స్పష్టం చేశారు. గత ఏడాది కాలంగా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో కష్టపడి మెరు గైన సేవలు అందించారని అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్న పిల్లలు మహాత్మా గాంధీ, స్వాతంత్య్ర పోరాట ఘట్టాలపై అధ్యయనం చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనా లని కాంక్షించారు. జిల్లా ప్రజలకు, కలెక్టరేట్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే జాతి మీద మహాత్మా గాంధీ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియాతో కలసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వయంగా మిఠాయిలు పంచిపెట్టారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ లోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.