పీ`4 కార్యక్రమం నిర్బంధం చేయడం ఖండిస్తున్నాం
కఆప్టా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణపతిరావు, ప్రకాష్ రావు
అక్షర కిరణం, (అమరావతి): రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఉన్నత అధికారులతో నిమిత్తం లేకుండా జిల్లా కలెక్టర్ల ఆధర్వంలో పి 4 కార్యక్రమంలో ఉపాధ్యాయులతో నిర్బంధంగా రిజిస్ట్రేషన్, దత్తత చేయించటాన్ని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏపీఎస్ గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఖండిరచారు. ఈ విషయంలో వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దత్తత అనే పక్రియ స్వచ్ఛంధంగా ఉండాలి కానీ నిర్బంధంగా చేయించటం పద్దతి కాదని లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పేర్కొన్నారు. జిల్లా అధికారులు నియంతృత్వ ధోరణితో మీరు ఖచ్చితంగా ఇన్ని కుటుంబాలు దత్తత తీసుకోవాలి అని నిర్బంధం చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి 4 కార్యక్రమంను నిర్బంధంగా కాకుండా స్వచ్ఛంద పద్ధతిలో ఎవరైతే స్వచ్చందంగా ముందుకు వస్తారో వారితో చేయించాలని డిమాండ్ చేశారు. పి 4 దత్తత కార్యక్రమంలో ఉపాద్యాయు లతో నిర్బంధంగా చేయించడం వలన వారిలో ఎక్కువ శాతం ఈ కార్యక్రమంపై అనాసక్తితో ఉన్నారన్నారు. ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందని కావున ఈ కార్యక్రమం నిర్బంధంగా చేయించడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు.