1న విశాఖ, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
అక్షర కిరణం, (విశాఖపట్నం/విజయనగరం): విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్ట్ ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జర గనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్?పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ శాలలు, కాలేజీలకు శనివారం (ఆగస్ట్ ఒకటి) సెలవు ఉం టుందని అధికారులు తెలిపారు. ఈ సెలవుకు బదులుగా మరో రోజు ఎప్పుడైనా కాంపన్సేటరీ వర్కింగ్ డేగా మారు స్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విజయ నగరం జిల్లాలో శుక్రవారం కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతోంది. ఈ కార్యక్రమం కోసం చుట్టుపక్కల ఉన్న 34 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 4800 బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. విజయ నగరం, శ్రీకాకుళం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమం లోనే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో పది పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. 30 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులను అందు బాటులో ఉంచారు.
ఇక భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజ లకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. ఉదయం బస్సులు బయల్దేరే సమయంలో పులి హోర, పొంగల్, టమాటా బాత్ వంటి అల్పహారం, మంచి నీళ్లు అందిస్తారు. మధ్యాహ్నం సభ పూర్తి అయిన తర్వాత.. ప్రత్యేక శిబిరాలలో భోజన ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం పదికి పైగా ప్రత్యేక భోజన స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయం చేరుకుంటారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభో త్సవంతోపాటుగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపడతారు. మధ్యాహ్నానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.