ఈ 20 పెట్రోల్ వాడే.. వాహనాల్లో స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందే
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): దేశంలో ఈ 20 పెట్రోల్ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ ఈ 20 పెట్రోల్ వాడకంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఈ 20 పెట్రోల్ వినియోగంతో పాత వాహనాల్లోని కొన్ని స్పేర్ పార్ట్స్ మార్చాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్యూయల్ హోస్‌లు, సీల్స్, ఓ రింగులు వంటి భాగాలు గట్టిపడటం, ఉబ్బడం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.
భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ 20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే 2016కు ముందు తయారైన.. మరీ ముఖ్యంగా బీఎస్-3 వాహనాల యజమానులకు కీలక హెచ్చరిక వచ్చింది. జు20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఇప్పటికే పార్లమెంట్లో వెల్లడించారు. అయితే.. సాధారణ సర్వీసింగ్ సమయంలో వాటిని సులభంగా మార్చుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. మరోవైపు.. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్ కలిపేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
2016కు ముందు తయారైన బీఎస్-3 వాహనాల్లో ఫ్యూయల్ హోస్‌లు, గ్యాస్కెట్లు, ఓ రింగ్‌లు, సీల్స్, పైపులు, ఫ్యూయల్ పంప్‌లోని కొన్ని రబ్బరు భాగాలు జు20 పెట్రోల్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని వాహన నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆరఏఐ) గతంలో నిర్వహించిన అధ్యయ నంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
ఈ పరిశోధన ప్రకారం ఈ20 ఇంధనానికి ఎక్కువకాలం గురైన రబ్బరు, ప్లాస్టిక్ పదార్థాలు క్రమంగా గట్టిపడటం, వాటి బలం తగ్గిపోవడం, వంగిపోయే సామర్థ్యం తగ్గడం, ఉబ్బి పోవడం వంటి మార్పులకు లోనవుతాయని నిపుణులు చెబుతు న్నారు. దీని వల్ల రబ్బరు భాగాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. సీలింగ్ సరిగా లేక ఇంధనం లీకేజీ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని సూచిస్తున్నారు.
ఈ ఈ20 పెట్రోల్ కారణంగా అన్ని వాహనాల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటు న్నారు. 2016 తర్వాత తయారైన చాలా వాహనాలు ఈ 20 అనుకూలంగా తయారు చేశారు. పాత బీఎస్-3 వాహనాల్లో మాత్రమే కొన్ని రబ్బరు భాగాలను అవసరమైతే మార్చాల్సి రావొ చ్చని చెబుతున్నారు. దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధన విని యోగాన్ని విస్తరించే క్రమంలో పాత వాహనాల యజమానులు తమ వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించు కోవడం, ఫ్యూయల్ సిస్టమ్‌లోని రబ్బరు భాగాల పరిస్థితిని పరిశీ లించుకోవడం మంచిదని నిపుణులు హితవు పలుకుతున్నారు.
పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. జు20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ 2 నుంచి 6 శాతం తగ్గుతుందని తెలిపారు. ఈ20 వాడకం వల్ల వాహనంలో ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు రాలేదని పేర్కొన్నారు. ఈ 10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ 20 పెట్రోల్ 30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని వెల్లడించారు. 2001లోనే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. 2006లో ఈ 5 విధానం తీసుకురాగా.. క్రమంగా పెంచుకుంటూ వచ్చినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా బైక్‌లు.. 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఈ 20 పెట్రోల్‌తో నడుస్తున్నాయని స్పష్టం చేశారు.