నచ్చిన వీడియో షేర్ చేస్తా: కేసులకు భయపడను
సీఐడీ కేసుపై వైసీపీ నేత అంబటి రాంబాబు
అక్షర కిరణం, (మంగళగిరి): మంగళగిరి సీఐడీ కార్యాలయంలో తనపై నమోదైన కేసు గురించి మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తన మీద సీఐడీ కేసు నమోదైనట్లు తెలియదన్న అంబటి రాంబాబు.. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడనని స్పష్టం చేశారు. తనకు నచ్చిన వీడియోను సామాజిక మాధ్యమా ల్లో షేర్ చేస్తానన్న అంబటి రాంబాబు.. కేంద్ర మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ గురించి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో అసభ్యకరం కాదన్నారు. అది కేవలం పొలిటికల్ కార్టూన్ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తన ఇంటి మీద దాడి జరిగినప్పుడు.. బాధితుడైన తననే పోలీసులు అరెస్టు చేశారని.. దీని వెనుక పెమ్మసాని చంద్ర శేఖర్ కుట్ర ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. పెమ్మసాని చంద్రశేఖర్ తన ఇంటిపై దాడి చేయించారని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత తనను హింసించమని పోలీసులకు ఫోన్ చేసి చెప్పారని అంబటి రాంబాబు ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినవారు ఎవరైనా, అది కేంద్రమంత్రి అయినా సరే.. విచారణ జరపా లని తాను కోరినట్లు అంబటి రాంబాబు తెలిపారు. అయితే తన ఫిర్యాదుపై విచారణ జరపలేదని.. అందుకే పోరాడు తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్, తనను ట్రోల్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా లో వీడియోలు, పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తమపై ఏఐ వీడియోలు రిలీజ్ చేసే వారిపై కేసులు పెట్టారా అని అంబటి రాంబాబు నిలదీశారు. పెమ్మసానిపై పెట్టిన వీడియో, కార్టూన్‌కు తనదే బాధ్యతన్న అంబటి రాంబాబు.. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో ఏఐతో రూపొందిం చిన వీడియోను పోస్ట్ చేశారనే ఆరోపణలపై అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసినట్లు ఉండే వీడియోను అంబటి రాంబాబు పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మద్దిరాల మ్యానీ ఈ విషయంపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మంగళగిరి సీఐడీ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి కేసులకు తాను భయపడే రకం కాదని అంబటి రాంబాబు చెప్తున్నారు.