విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రి క్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం కూడలిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, నిర్వాసితుల రాస్తారోకో చేశారు. ఈప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీ కరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర సనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా విశాఖ ఉక్కు ను సెయిల్‌లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈక్రమంలో జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బం ధించారు. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన చేపట్ట డంతో కూర్మన్నపాలెంలో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యిం ది. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో పోలీసులు చర్చలు జరిపారు.