త్వరలో విశాఖపట్నం సెమీ రింగ్ రోడ్డు !
కఆరు లైన్లతో గ్రీన్ఫీల్డ్ సెమీ రింగ్ రోడ్డు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని చేపట్టింది.. భవనా లతోపాటుగా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసింది. అమరావతితోపాటుగా రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు పనుల్ని వేగవంతం చేసింది.. నగరానికి పలు ఐటీ కంపెనీలతో పాటుగా పరిశ్ర మల్ని తీసుకొచ్చే పనిలో ఉంది. ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్ను కూడా పట్టాలెక్కించే పనిలో ఉంది. ఈక్రమంలో విశాఖ పట్నానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తోం ది. అమరావతికి రింగ్ రోడ్డు నిర్మించిన విధంగానే విశాఖ కు కూడా ఒక రింగ్ రోడ్డు ఉండాలని భావిస్తున్నారు. సముద్రం, కొండలు అడ్డంకిగా ఉండటంతో పూర్తి రింగ్ రోడ్డు సాధ్యం కాదు కాబట్టి.. సెమీ రింగ్ రోడ్డును ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఆదేశిం చారు. వీఎంఆర్డీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
విశాఖపట్నం నుంచి నేషనల్ హైవే వెళుతోంది.. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు కేంద్రం కోస్టల్ కారిడార్ ప్రతిపాదన చేసింది. ఇది సెమీ రింగ్ రోడ్డులో సగం అవుతుందని అధికారులు చెబుతు న్నారు. మిగిలింది రింగ్ రోడ్డును అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద మొదలుపెట్టి తాళ్లపాలెం, అనకాపల్లి మీదుగా కొత్త వలస ద్వారా విజయనగరం నుండి భోగాపురం కలుపుతూ ఏర్పాటు చేయాలని వీఎంఆర్డీఏ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి, విశాఖపట్నం పట్టణా లను టచ్ చేయకుండా అటు వైపుగా విజయనగరం మీదుగా భోగాపురం వరకు రోడ్డు వెళ్తుంది.
ఈ మేరకు సెమీ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పొడవు, వెడల్పు, భూములు, బ్రిడ్జిల నిర్మాణంపై అధ్యయనం కోసం వీఎంఆర్డీఏ కన్సల్టెంట్లను ఆహ్వానించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరతామని.. ఆ తర్వాత దానిని ప్రభుత్వా నికి సమర్పిస్తామని చెబుతోంది వీఆర్ఎండీఏ. ఈ ప్రతి పాదిత సెమీ రింగ్ రోడ్డు (ఎస్ఆర్ఆర్) అనకాపల్లి-పెందుర్తి -ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకు వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఇది ఆరు వరుసల్లో ఉంటుందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా వేగవంతం అయ్యాయి.. ఈ క్రమంలో ఈ సెమీ రింగ్ రోడ్డును అక్కడి వరకు ప్లాన్ చేస్తున్నారు. నగరం నుంచి ఎయిర్పోర్టుకు కూడా కనెక్టివిటీ ఉంటుందని చెబుతున్నారు.