సింహాచలం దేవస్థానానికి విశాఖ డెయిరీ నెయ్యి
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని దేవా దాయ శాఖ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్ లో ఈనెల 21వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశారు. ప్రస్తుతం అప్పన్న దేవస్థానం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలను విక్రయిస్తోంది. ఈక్రమంలో వంద డబ్బాల విశాఖ డెయిరీ నెయ్యి (1500 కిలోలు) దేవస్థానానికి రానుంది.