కుంచుమాంబ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం
అక్షర కిరణం, (మాధవధార): మాధవధారలో శ్రీ కుంచుమాంబ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి గ్రామ దేవత ఆలయం అయినటువంటి శ్రీకుంచుమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో అంకురార్పణ చేపట్టారు.శ్రీ కుంచుమాంబ యూత్ కమిటీ చేపడుతున్న 43వ వినాయక చవితి వార్షికోత్సవ ఉత్సవాలకు గ్రామస్తులు ఆధ్వర్యంలో పందిరి రాటవేశారు. ఈకార్యక్రమంలో సనపల వరప్రసాద్ పప్పల సునీత కమిటీ సభ్యులు పప్పల వరహానరసింహం, అజయ్, మంగు, సనపల రాజు గ్రామస్థులు పాల్గొన్నారు.