మూడు ట్రిప్పులకే ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలు రద్దు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఉత్తరాంధ్రవాసుల కోసం ఏర్పాటు చేసిన ప్రయాగ్‌రాజ్--విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిన ఈ ప్రయాగ్‌రాజ్--విశాఖ పట్నం-ప్రయాగ్‌రాజ్ రైలును రద్దు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశంలోని త్రివేణి సంగమా నికి కనెక్టివిటీ కోసం ఈ రైలును ఏర్పాటు చేశారు. ఆగస్టు 26 నుంచి నవంబర్ 27 వరకు షెడ్యూల్ ప్రకటించారు.. ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించారు. దసరా, దీపా వళి పండుగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని భావించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లో బయలుదేరి శనివారం విశాఖపట్నం చేరుకుంటుంది.. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరుతుంది.
ఈ రైలు నడిపే విషయంలో కొన్ని లోపాలు బయట పడ్డాయి.. సాంకేతిక, నిర్వహణ, లైన్ క్లియర్ సమస్యలతో ఈ రైలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలు వెళ్లే రూట్లో బిలాస్పూర్, భువనేశ్వర్ నుంచి స్పీడ్‌గా పంపించే అవకాశం ఉన్నా.. గంటల పాటూ ఆలస్యం అయ్యింది. విశాఖపట్నం శివారు ప్రాంతానికి వచ్చినా సరే గంటల తరబడి అక్కడే ఉంచారు. అలా ఈ రైలును కేవలం మూడు ట్రిప్పులతోనే సరిపెట్టారు. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ నుంచి విశాఖపట్నం వచ్చి తిరుగు ప్రయాణంలో మళ్లీ ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు 15 గంటలకుపైగా ఆలస్యం అయ్యింది. ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ రైలు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చినా సరే రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రయాగ్‌రాజ్ టు విశాఖపట్నం రైలును ట్రైన్ ఆన్ డిమాండ్ (టీవోడీ) కింద ప్రారంభించారు. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేస్తారని ఆశించారు. కానీ ఉన్నట్టుండి ఈ రైలును రద్దు చేయడంతో ఉత్తరాంధ్ర ప్రయాణికులకు నిరాశ మిగిలింది.
ఈ ప్రయాగ్‌రాజ్-విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. మూడు ట్రిప్పులైనా సరే 100శాతం ఆక్కుసెన్సీతో నడి చాయి. అయితే ఈ రైలు నడిచే మార్గంలో లైన్ క్లియరెన్స్ సహా అనేక సమస్యల కారణంగా ఆలస్యమైంది. ఈ రైలులో ప్రయాణించినవారు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రైలుకు ఆదరణ ఉన్నా రద్దు చేయడంపై విమర్శలు వస్తు న్నాయి. వెంటనే ఈ రైలును పునరుద్ధరించాలని, రెగ్యులర్ రైలుగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే గంటల కొద్ది ఆలస్యం, ప్రయాణికులకు అసౌకర్యం, నిర్వహ ణపరమైన ఇబ్బందులతో ఈ రైలును రద్దు చేశారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ప్రయాగ్‌రాజ్-విశాఖపట్నం-ప్రయాగ్‌రాజ్ రైలు రద్దు అంశం హాట్‌టాపిక్ అవుతోంది.