ఈఆర్వో చాంబర్లో రాజకీయ పార్టీలతో సమావేశం
అక్షర కిరణం, (విశాఖపట్నం): సీతమ్మధారలోని తహసీల్దార్ కార్యాలయం ఈఆర్వో చాంబర్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఆర్వో మాట్లాడుతూ 22901 అనిమోలీస్లో 21,647 హియరింగ్స్ పూర్తి అయినట్టు తెలిపారు. ఈనాటికి ప్రత్యేక శిబిరాలతో, ఆన్‌లైన్‌తో 2463 కొత్త ఓటర్లు నమోదైనట్టు తెలిపారు. 2242 కరెక్షన్స్ సంబంధించి క్లెయిమ్స్ వచ్చాయని చెప్పారు. అదేవిధంగా 61 dవatష్ట్ర cశ్రీaఱఎs వచ్చాయని తెలిపారు. ఈరోజు వరకు వచ్చిన క్లెయిమ్స్ సమాచారం పొలిటికల్ పార్టీలకు అందజేశామన్నారు. ఈ నెల రోజుల పాటు జరిగిన హియరింగ్స్‌తో తప్పుల సవరణలు, నో మ్యాపింగ్ మ్యాపు చేయడం అన్నీ సక్రమంగా జరిగాయని ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్ మూడవ తేదీన నోటిఫై చేస్తామని ఉత్తర నియోజకవర్గం ఈఆర్వో తెలిపారు. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా తెలియజేయాలని కోరారు.