విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ జిల్లా భీమిని పట్నం సాగరతీరంలో తీరప్రాంత పరిరక్షణ నియమాలను (సీఆర్‌జడ్) వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఉల్లఘించినట్టు తేలింది. దీంతో సముద్ర గర్భంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ కట్టడాలను జీవీఎంసీ అధికారులు తొలగిస్తు న్నారు. నేహారెడ్డి సీఆర్‌జెడ్ ఉల్లంఘనటలపై హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం 23-02-2024న డబ్ల్యుపి (పిల్) నంబర్ 53/2024ను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మూర్తి యాదవ్ పిల్‌పై హైకోర్ట్ ఆదేశా లతో రెండు వారాల కిందటే కూల్చివేతను జీవీఎంసీ అధికా రులు ప్రారంభిం చారు. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలని హైకోర్ట్ ఆదేశం జారీ చేసింది. అంత ేకాకుండా కూల్చివేతల ఖర్చు నేహారెడ్డి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భీమిలి సర్వే నంబర్ :1516,1517 1519, 1523 పరిధిలో సుమారు నాలుగు ఎకరాలు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారు. పర్యావరణ శాఖల నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి నిర్మిస్తున్న నక్షత్ర హోటల్ హోటల్ నిమిత్త గోడ, శాశ్వత కాంక్రిట్ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. వాటిని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.