ఏపీ డిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు వెరిఫికేషన్
అక్షర కిరణం, (అమరావతి): ఏపీలో డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌తో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏపీడిజీవెరిఫైలో అన్ని రకాల సర్టిఫికెట్లు పరి శీలించుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ పరి శీలించుకోవచ్చు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు సర్టిఫికెట్లను డిజీవెరిఫైలో భద్రపరి చారు. ప్రధానంగా విద్యార్థులకు ఇబ్బందు లేకుండా పోతా యని అధికారులు చెబుతున్నారు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధిం చి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిసారి సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏపీడిజీవెరిఫైలో ప్రభుత్వం అన్ని రకాల సర్టిఫికెట్లను, పాత రికార్డులతో సహా రియల్ టైం డేటాను భద్రపరుస్తోంది. ఒకవేళ సర్టిఫికెట్లలో జరిగితే వెంటనే సిస్టమ్‌లో మొత్తం సమాచారం అప్డేట్ అవుతుంది. ఇకపై ఈ డేటాను అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థల పరిశీలనకు అందు బాటులో ఉంచింది. ఈ డేటాను ఎవ్వరూ హ్యాక్ చేయ కుండా ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తు న్నారు. అసలు విద్యార్థులు సమర్పించే సర్టిఫికెట్ ఒరిజి నల్?, కాదా అనేది పరిశీలించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 నుంచి ఇప్పటి వరకు 1.81 కోట్ల పదోతరగతి మెమోలను డిజీవెరిఫైలో ఉంచింది. ఈ ఏడాది నుంచి పదో తరగతి మార్కుల జాబితా (మెమోలు)పై క్యూఆర్‌కోడ్‌ను ముద్రిస్తోంది. అవసరమైన సమయంలో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఏపీడిజీ వెరిఫైకు వెళ్తుంది. అక్కడ ఆ సర్టిఫికెట్ ఒరిజినలో కాదో కూడా తెలుసుకోవచ్చు. ఇంంటర్ విషయానికి వస్తే 2006 నుంచి 2025 వరకు 1.22 కోట్ల సర్టిఫికెట్లను భద్రపరి చింది. పాలిటెక్నిక్‌లకు సంబంధించి 4.03 లక్షల సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 7.99 లక్షల సదరం ధ్రువపత్రాలూ ఈ పోర్టల్‌లో ఉన్నాయి.
తాజాగా నిర్ణయం ప్రకారం.. రాష్ట్రంలో వివిధ అవసరాల కోసం సర్టిఫికెట్లను వరిఫై చేసేందుకు ఏపీ డిజివెరిఫై ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్ధల అడ్మిషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు వినియోగించే సర్టిఫికెట్ల వరకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారానే నిర్వహిస్తారు. అలాగే మాన్యువల్ వెరిఫికేషన్ కాకుండా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలో జారీ అవుతున్నాయి.. అందుకే ఫిజికల్ కాపీలు కాకుండా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేస్తారు. ఇలా చేయడం ద్వారా నకిలీలకు అవకాశం లేకుండా ఉండదని.. ఈ వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో నేరుగా చూడొచ్చు. ఏపీ డిజివెరిఫై ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్లు అన్నింటిని వెరిఫై చేస్తారు. ఒవేళ ఏపీ డిజివెరిఫై ప్లాట్ఫామ్లో సర్టిఫికెట్లు లేకపోతే.. ఆ ధ్రువపత్రాలను మాత్రమే మాన్యువల్‌గా పరిశీలించేందుకు అనుమతిస్తారు.