జాతీయస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు వాసంతి ఎంపిక
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్లో పాలిటెక్నిక్ డిప్లమా విద్యార్థిని ఇంటూరీ వాసంతి జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మేడి కొండూరు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఇంటూరీ రామేశ్వరరావు, నాగమణిల కుమార్తె ఇంటూరీ వాసంతి ఈనెల 18 తేదీన జరిగే జాతీయస్థాయి జూని యర్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు తరుపున పాల్గొనే జట్టుకు ఎంపికైంది. ఇప్పటివరకు వాసంతి పలు పోటీల్లో పాల్గొంది. 2023 సంవత్సరంలో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ చూపింది. 2024వ సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లోలో జరిగిన అండర్ 17 జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంది.
రాష్ట్రస్థాయిలో సైతం పలు పొటీల్లో వాసంతి ప్రతిభను చాటింది
2023వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన అండర్ 14వ స్టేట్ లెవల్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొని రజత పతకం సాధించింది. 2023వ సంవత్సరం అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భాగస్వాము రాలైంది. 2024వ సంవత్సరం వైజాగ్లో జరిగిన అండర్ 14 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంది. 2024వ సంవ త్సరంలో వినుకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటింది. ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంది. ఇప్పటివరకు నాలుగు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరిచింది. ఇప్పటివరకు ఒక్కసారి రాష్ట్రస్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించింది.