మూలపేటలో యూరియా ప్లాంట్
îప్రతి ఏటా 1.27 మిలియన్ టన్నుల ఉత్పత్తి îక్రేంద్ర సంస్థలు గెయిల్, క్రిబ్కో భాగస్వామ్యం
అక్షర కిరణం, (మÖలపేట/శ్రీకాకుళం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ రాబోతోంది. కేంద్ర సంస్థలు గెయిల్, క్రిబ్కో భాగస్వామ్యంతో రూ.13,500 కోట్లతో మూలపేటలో భారీ యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఎరువుల దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు యూరియా ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ ప్లాంట్ కోసం విడతలవారీగా దాదాపు రూ.13,500కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ యూరియా ప్లాంట్‌ను శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏర్పాటు చేయనున్నారు.. ఏడాదికి 1.27 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఏపీఈడీబీ (ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు)తో త్వరలోనే ఎంవోయూ చేసుకోను న్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్‌తో 300 నుంచి 400 మందికి ప్రత్యక్షంగా.. వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మూలపేటలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా అందించనుంది. ప్లాంట్ కోసం అవసరమైన భూమిని నామమాత్రపు ధరకే కేటాయించనుంది. ఈ ప్లాంట్ వరకు రోడ్లు, విద్యుత్, నీరు, రైల్వే కనెక్టివిటీ వంటి అవసరమైన ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ఉచితంగా సమకూర్చనుంది. ఈ ప్లాంట్ కోసం 700 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పశ్చిమాసియాలో యుద్థం కారణంగా ఎరువుల కొరత ఎదురవ్వడంతో దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేలా ప్లాన్ చేశారు. అందుకే కేంద్రం ఇటీవల ‘నేషనల్ ఇనట?్వసమెంట్ పాలసీ ఫర్ యూరియా-2026’కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అందుకే మూలపాడులో గెయిల్, క్రిబ్కో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
తిరుపతిలో మరో పరిశ్రమ ఏర్పాటు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4వేల కోట్ల పెట్టుబడి వచ్చింది. భారత్‌కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎంఅండ్టీ కంపెనీలు కలిసి భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖఫట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పరిశ్రమ ఏర్పాటు, పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.