సీఎం చంద్రబాబు సమక్షంలో ఒబెరాయ్ గ్రూప్ ఎంవోయÖ
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, ఒబెరాయ్ గ్రూప్ మధ్య దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం అధికారికంగా కుదిరింది. సీఎం చంద్రబాబు సమక్షంలో C=ణA అధికారులు, ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు ఈ ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది. మౌలిక వసతులు, ఆతిథ్య రంగం రూపురేఖలు మార్చే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతిలో ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ హోటల్ రంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. విశాఖపట్నం లో జరుగుతున్న 31వ సీఐఐ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, ఒబెరాయ్ గ్రూప్ మధ్య దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం అధికారికంగా కుదిరింది.
సీఎం సమక్షంలో ఎంవోయూ: రూ.174 కోట్ల పెట్టుబడి
సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో C=ణA అధికారులు, ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు ఈ ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో అమరావతికి రూ.174 కోట్ల మేర భారీ పెట్టుబడులు రాను న్నాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇదొక ముందడగుగా ప్రభుత్వం భావిస్తోంది.
400 మందికి ఉపాధి
అమరావతిలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా మరో 250 మందికి.. మొత్తంగా 400 మందికి ఉపాధి అవకాశా లు వస్తాయని అంచనా. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.