కాలేజీ బస్సును ఢీకొట్టిన ట్రక్కు: 10 మందికిపైగా విద్యార్థులు మృతి
అక్షర కిరణం, (అసోం/జాతీయం): అసోంలో శుక్ర వారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కజిరంగా జిల్లా రాంగజన్ ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈఘటనలో 10 మందికిపైగా విద్యార్థు లు అక్కడకక్కడే మృతిచెందారు. అనేక మంది గాయ పడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలి పారు. ప్రమాద సమయానికి బస్సులో 35 మంది విద్యా ర్థులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం కొహరా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. లోపల చిక్కుకున్న విద్యార్థులను అతికష్టంతో బయటకు తీశారు. మృతదేహా లను బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.