ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా?
îమున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
అక్షర కిరణం, (ఢిల్లీ/అమరావతి): ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బీజేపీ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న తీవ్రమైన ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన వస్తోందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికే చచ్చిపోయినట్టేనా? అని ప్రశ్నించారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికీ చర్చ సాగు తూనే ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారం కోర్టు వరకూ కూడా వెళ్లింది. కోర్టు సూచనలు ప్రకారం పోలింగ్ నిర్వహణ, ఆ తర్వాత ఫలితా లు కూడా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయభేరి మోగించాయి.
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రశ్నలు
తాజాగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బీజేపీ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న తీవ్రమైన ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన వస్తోందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికే చచ్చిపోయిన ట్టేనా? అని క్వశ్చన్ చేశారు.
అంతేకాదు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే ప్రజా స్వామ్యా నికి పునాది అని వాటిని రాజకీయ అధికారం కోసం బలిపెట్టలేం అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్నికల పవిత్రతను కాపాడేందుకు కఠినమైన, అమలు చేయదగిన మార్గదర్శకాలను కోరుతూ కోర్టును ఆశ్రయించాలనుకుం టున్నానని కూడా ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 2026 మొదటి వారంలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల ఫలితాలు వెలువ డ్డాయి. అందులో తెలుగు దేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. కోర్టు వివాదాలతో 23 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లకు అప్పుడు ఎన్నికలు జరగలేదు. అయితే ఇప్పుడు ఆ వివాదాలు తొలగిపోవడంతో... ఈ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ పరిణామాల మధ్యే సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శంగా మారాయి. దీంతో మరోసారి ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అంశాలు తెరపైకి వచ్చాయి.