మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ
îచంద్రబాబుతో జాంటీì రోడ్స్ సమావేశం
అక్షరకిరణం, (విశాఖపట్నం): విశాఖలో నిర్వహి స్తున్న సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు భోగాపురం విమానాశ్రయం వద్ద ముక్కం బీచ్‌లో రూ.55 కోట్లతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు ముక్కం కోస్టల్ వెల్నెస్, సర్ఫ్ క్లబ్ ముందుకొచ్చింది. జాంటీ రోడ్స్ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయన ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రిలయన్స్, గెయిల్, సెయింట్ గోబెయిన్, ఎల్ అండ్ టీ, గ్రీన్కో ఎనర్జీస్ సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. క్లీన్ ఎనర్జీస్ సొల్యూషన్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్, కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో కాపీలను సంస్థ ప్రతినిధులకు సీఎం అందించారు.
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజి హిరమత్సు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమ య్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు ఆ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని, అనంతపురం లేదా విశాఖ వద్ద ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని, ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చితో కలిసి జేఆరఐ పనిచేస్తోందని చైర్మన్ తెలిపారు. త్వరలో అమరావతిలో ఏపీ - జపాన్ బిజినెస్ సమ్మిట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు. ప్రతిపాదనలకు తన వంతు సాయం అందిస్తానని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
అలాగే సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎసఎంఈ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు. ఇందు లో ప్రిసిషన్ ఇంజనీరింగ్ - ఎలక్ట్రికల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, మెటీరియల్, మొబిలిటి సొల్యూషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా అండ్ మెడ్ టెక్ స్టాళ్లు ఉన్నాయి. ఆర్టీఐ హెచ్ ఇన్నోవేషన్స్, అగ్రిటెక్, మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన స్టాళ్లను కూడా సందర్శించారు.