పోలమాంబ జాతర పోస్టర్ల ఆవిష్కరణ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జీవీఎంసీ 9వ వార్డు హనుమంతువాక, సంజయ్ గాంధీ కాలనీలో కొలువై ఉన్న పోలమాంబ అమ్మవారి పంచరాత్రి జాతర ఘనంగా నిర్వహించుకుందామని ఉపకార్ ఛారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, సంఘ సేవకుడు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు. ఉషోదయ జంక్షన్‌లోని కేడబ్ల్యూ జేెడబ్ల్యూ కార్యాలయంలో ఆలయ నిర్వాహకులు, జాతర కమిటీ ప్రతినిధులు ఆహ్వాన, ప్రచార పత్రికతో వచ్చి డాక్టర్ కంచర్లకు అందజేసి ఆహ్వానించారు. అనంతరం నిర్వాహకులతో కలిసి ఆయన జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా డాక్టర్ కంచర్ల మాట్లాడుతూ పోలమాంబ అమ్మవారి పంచరాత్రి మహోత్సవాలకు ఎప్పటి మాదిరిగానే తనవంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించాలని ఎక్కడా రాజీ లేకుండా పండుగను నిర్వ హించాలన్నారు. అమ్మవారి దయ, కరుణ ఈ ప్రాంత వాసు లపై పుష్కలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని, అమ్మవారే తన జాతరను ఈప్రాంతీయులతో చేయించుకుంటారన్నారు. తాను ఉత్స వాలకు హాజరవుతానని చెప్పారు. అనంతరం ఆలయ ధర్మ కర్త కంచుమూర్తి నాగరాజు, ఆలయ అధ్య క్షుడు ఒమ్మి రాజు, కెర్రు తాతారావు మాట్లాడుతూ ఏప్రిల్ 11 నుంచి 15 వరకూ అమ్మవారి పంచరాత్రి ఉత్సవాలు జరుగుతాయ న్నారు. 4న రాట మహోత్సవం, 6న పండుగ చాటింపు, 12న మహిళలతో కుంకామర్చనలు, అదే రోజు భారీ అన్న సమారాధన, 15న పండుగ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాత్రికి డాన్స్ బేబీ డాన్స్, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటా యన్నారు. జాతర కమిటీ నిర్వాహకులు డాక్టర్ కంచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపకార్ ఛారిట బుల్ మేనేజర్ సుధీర్‌కుమార్, నాగు, అరుణ, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.