సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈసదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారితోపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, పి.విష్ణుకుమార్ రాజు కూడా సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రాధాన్యత కలిగిన పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.