‘చకోర’ సినిమా టీజర్ రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం ప్రేమ కథతో తెరకెక్కిన చకోర చిత్రం ఘన విజయం సాధించి తెలుగు ప్రేక్షకులను అలరించాలని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. హై వే వెంచర్స్ సమర్పణలో హై జాయ్ కమర్షియల్ బ్యానర్‌పై డాక్టర్ చింతాడ హేమారావు నిర్మాతగా, మెగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు మంగ శ్రీని వాస్ దర్శకత్వంలో శ్రవణ్, మలైకా టి వాసు వల్ జంటగా రూపొందుతున్న ప్రేమకథ చిత్రం ‘చకోర‘ (లునార్ లవ్ బర్డ్) టీజర్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. టీజర్‌ను చూసిన ఆయన చాలా బాగుందని ప్రశంసించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ సభ్యులకు అభిందనలు తెలిపారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన చిత్ర నిర్మాత డాక్టర్ చింతాడ హేమారావును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందిం చారు. ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. కార్యక్రమం లో చిత్ర నిర్మాత డాక్టర్ చింతాడ హేమారావు, లైన్ ప్రొడ్యూసర్ సిరిపురపు కపర్ది, క్యాషియర్ పెద్దింటి హరీష్, లొకేషన్స్ అండ్ పబ్లిసిటీ ఇంచార్జ్ సనపల చిన్నబాబు, మగతపాడు సర్పంచ్ రమేష్ బాబు, సోషల్ మీడియా ఇన్ చార్జ్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.