ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు నివాళులు
అక్షర కిరణం, (పలాస/బొడ్డపాడు): బొడ్డపాడు లోని అమరవీరుల స్మారక హాలులో ప్రజాసంఘాల నాయకత్వంలో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు పత్తిరి దానేష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకులు, సంఘ సభ్యులు, ప్రజా కళా మండల నాయకులు సభ్యులు మహిళా సంఘాల సభ్యులు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బాలకృష్ణ పీవోడబ్ల్యు నాయకులు కుసుమ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు వినోద్, ఇఫ్తు నాయకులు వీరస్వామి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు మల్లేశ్వరరావు, రామారావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు దున్న గోవిందు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యులు ధర్మారావు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా బాధ్యులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.