పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు
అక్షర కిరణం, (విశాఖపట్నం): వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు.. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజల కోసం అమరులైన పోలీస్ వీరులకు నివాళులర్పిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పూర్ణ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసుల త్యాగాలను కొనియాడుతూ వారి సేవలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ జీడీ బాబు, ఎస్ఐలు విశ్వనాథ్, లక్ష్మణ్, శ్రీని, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ట్రాఫిక్, క్రైమ్ విభాగాల సిబ్బంది అందరూ పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.