1న నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగరంలో ఆగస్టు 1వ తేదీన జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానా శ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న సందర్భంగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చీ ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాల ను ఏర్పాటుచేశారు. కానీ ఆగస్టు 1వ తేదీన ఉదయం 5 నుంచి పది గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు సాధారణ ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. అదేవిధంగా అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలకు ఉదయం ఐదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు విశాఖపట్నం లోనికి అనుమతి లేదని తెలిపారు. సభాస్థలికి వచ్చే అన్నివాహనాలకు ప్రాంగణానికి దగ్గర్లోH ûపార్కింగ్ సౌకర్యం కల్పించామని ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.