అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అక్షర కిరణం, (అమరావతి): అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కొత్త లిక్కర్ పాలసీతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దీనిని వెంటనే సరిదిద్దుకో వాలని కోరారు. లేదంటే ప్రజల తరఫున పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. మీరు, మీ వాళ్లు డబ్బు సంపాదించు కోవడం కోసం తెచ్చిన ఈ లిక్కర్ పాలసీ రాష్ట్రానికి, ప్రజలకు చాలా ప్రమాదకరం అన్నారు. అక్రమార్జన కోసమే ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటు కు అప్పగించారు’ అని జగన్ ఆరోపించారు.