కరకచెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): పెద్ద వాల్తేరు లోని కరక చెట్టు పోలమాంబ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని చుట్టుపక్కల నుండి ఎక్కువమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించు కుంటారని ఈ సందర్భంగా అందరూ వరుసక్రమంలో వచ్చి దర్శించుకోవాలని తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులు విలువైన వస్తువులు చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి సహకారం కావలసిన పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ బందోబస్తులో ఎస్ఐలు ఎస్.సంతోష్, కె.సురేష్ సిబ్బంది పాల్గొన్నారు.