త్రీ టౌన్ సీఐగా రమణయ్య బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పల్లా రమణయ్య బాధ్యతలు స్వీకరిం చారు. 2004 బ్యాచ్‌కి చెందిన రమణయ్య గతంలో పెందు ర్తి, అనకాపల్లి, ఎంవీపీ పోలీస్ స్టేషన్, నర్సీపట్నం స్టేషన్లో పనిచేశారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వెనుకాడేది లేదని పేర్కొన్నారు. సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. సీఐకు స్టేషన్ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.