ఎంబీఏ విద్యార్థి నుంచి వంద గ్రాముల బంగారం స్వాధీనం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): చదువుకుం టూ.. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఏసీపీ వెంకటరావు ఎంవీపీ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. పూర్ణామార్కెట్ రంగిరీజు వీధిలో నివాసముంటున్న నందవరపు చాణిక్య(21) రుషికొండ లోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవ త్సరం చదువుతు న్నాడు. ఏసీ మెకానిక్‌గా కూడా పనిచేస్తుంటాడు. ఈనెల 3వ తేదీన సీతమ్మధారలో నివాసముంటున్న కొండ్రు ఉదయలక్ష్మి తన ఇంటి ఏసీ మరమ్మతుల కోసం చాణిక్య ను సంప్రదించారు. అతను ఏసీ రిపేరు చేస్తూ ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్నారని గుర్తించి ఆమె పనుల్లో ఉండగా.. మరో గదిలో ఉన్న ట్రావెల్ బ్యాగులోని 100 గ్రాముల బంగారం చోరీ చేశాడు. 7వ తేదీన ఆమె చోరీ జరిగిందని గుర్తించి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉండడంతో నిందితుడిని సులభంగా గుర్తించి పట్టుకున్నారు. సీఐ సీహెచ్.శ్రీనివాస రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. ఎస్ఐ రాజు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.